సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కబాలి’ మీద ఇటీవల ఓ వివాదం రేగింది. బాలీవుడ్ చిత్రం ‘మదారి’ ఫస్ట్‌లుక్‌కి ‘కబాలి’ యూనిట్ కాపీ కొట్టిందని సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ‘మదారి’ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ కూడా.. తమ చిత్రం పోస్టర్‌ను ‘కబాలి’ యూనిట్ కాపీ కొట్టిందని చెప్పుకొచ్చాడు. అయినా తమకేం బాధ లేదని.. ఆడియన్స్ రెండు సినిమాలు చూడాలంటూ కబుర్లు చెప్పాడు. అయితే.. ఆ పోస్టర్ ఫ్యాన్ మేడ్ అని తెలియగానే తాను జోక్ చేశానంటూ ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
కాపీ కొట్టిన ఆ పోష్టర్ అఫీషియల్ కాదని తనకు ముందే తెలుసునని, తాను జోక్ చేశానని అన్నాడు. ‘‘ఒక నటుడిగా రజినీకాంత్‌ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. నేను ఆ పోస్టర్‌పై చెప్పింది ఓ జోక్ మాత్రమే. నేను ఏ పోస్టర్ గురించి అయితే మాట్లాడానో.. అది రజినీ ఫ్యాన్ క్లబ్ తయారు చేసింది. ఆ విషయం నాకు ముందే తెలుసు’ అంటూ చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ ఖాన్. మొత్తానికి.. ఇర్ఫాన్ ఇలా చెప్పడంతో ఆ పోస్టర్ నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా మీద మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ తెలుగు మూవీ ‘ఛత్రపతి’కి పోలినట్లుగా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
శ్రీలంక నుంచి వచ్చి వైజాగ్‌లో డాన్‌గా ప్రభాస్ ఎదిగినట్లుగానే.. తమిళనాడు నుంచి మలేషియా వెళ్లి అక్కడ డాన్‌గా మారిన వ్యక్తి కథే ‘కబాలి’ అంటున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ స్టోరీని డైరెక్టర్ రంజిత్ రివీల్ చేసిన నేపథ్యంలో ఈ రూమర్ చక్కర్లు కొడుతోంది. మరి.. దీనిపై క్లారిటీ రావాలంటే.. సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
Related posts:
No comments:
Post a Comment