Thursday, 16 June 2016

షాకింగ్ : గడ్డంతో మహేష్‌బాబు.. ఆ సినిమా కోసమే!!




ప్రిన్స్ మహేష్‌బాబు ‘లుక్స్’ పరంగా పెద్దగా ప్రయోగాలు చేయలేదు. చాలా హ్యాండ్సమ్‌గా ఉండడంతో ప్రతి సినిమాలోనూ స్టైలిష్‌గానే కనిపించాడు. కానీ.. మురుగదాస్‌తో చేయనున్న సినిమాలో మహేష్ గతంలో మునుపెన్నడూలేని విధంగా సరికొత్త గెటప్‌లో కనువిందు చేయనున్నాడని సమాచారం.


‘బ్రహ్మోత్సవం’ పరాజయం తర్వాత మహేష్ మీడియా కంటికి కనిపించలేదు. ఇందుకు గల కారణాలేంటని ఆరాతీయగా.. అప్పుడే తన తదుపరి ప్రాజెక్ట్‌ కోసం వర్కౌట్ ప్రారంభించాడని తెలిసింది. ఓవైపు యూనిట్ మొత్తం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నిమగ్నమైవుంటే.. మరోవైపు మహేష్ తన కొత్త లుక్ విషయంలో బిజీ అయ్యాడు. ఇండస్ట్రీవర్గాల నుంచి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం.. ఇందులో మహేష్ గడ్డంతో కనిపించనున్నాడు. స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు గడ్డం పెంచుకోవాలని మురుగదాస్ చెప్పిన నేపథ్యంలో మహేష్ తన లుక్‌ని మార్చుకునే పనిలో నిమగ్నమయ్యాడని తెలుస్తోంది. మరి.. ఈ సినిమా కోసం మహేష్ నిజంగానే గడ్డం పెంచుకోనున్నాడా? లేదా? అనేది తెలియాలంటే.. కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.



కాగా.. తెలుగు, తమిళం రెండు భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. హరిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఎస్.జే.సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. ఓ సోషల్ మెసేజ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.


mahesh-babu-beard-look-photo




Comments


comments



No comments:

Post a Comment