సురేందర్ రెడ్డి రేసుగుర్రం తర్వాత `కిక్-2` అనే చెత్త సినిమా తీసి జనం చేత చీవాట్లు తిన్నాడు. అంత మంచి సినిమా తీసి ఇంత చెత్త సినిమా కూడా తీస్తావా? అంటూ సూరి అభిమానులే నానా యాగీ చేశారు. అయితే అది గతం గతః. ప్రస్తుతం సురేందర్‌రెడ్డి అలియాస్ సూరి దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా తనిఒరువన్ రీమేక్ `ధృవ` తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించే సినిమా ఏది? అనే దానికి క్లారిటీ వచ్చేసింది. తదుపరి నితిన్ హీరోగా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించే భారీ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారుట.
సెప్టెంబర్‌లో ఈ మూవీ సెట్స్‌కెళుతుందని సమాచారం. అలాగే నితిన్ సూరితో సినిమా పూర్తి చేసుకుని తదుపరి రాధామోహన్ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు కమిటయ్యాడు. సూరి నితిన్‌తో బాగానే కమిటయ్యాడు కానీ ముందు ధృవ హిట్టెక్కాల్సి ఉంటుంది. అటుపైనే ప్రాజెక్టు అన్నమాట!
No comments:
Post a Comment