సాయి ధరమ్ ‘తిక్క` ప్రత్యేకగీతాన్ని సోమవారం హైద్రాబాద్ -అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ -“ప్రస్తుతం ఈ సినిమాలోని ఐటెం సాంగ్ ను చిత్రీకరిస్తున్నాం. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ రెండు పాటల్లో ఒక పాటను హైద్రాబాద్ లో మరొక పాటను లడక్ లో చిత్రీకరిస్తాం. ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం“ అన్నారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ-“బ్యాలెన్స్ రెండు పాటల షూటింగ్ పూర్తి చేసి, ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రొడ్యూసర్ ఎక్కడా రాజీకి రాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాటలు, సినిమా బాగా వచ్చాయి. పెద్ద విజయం అందుకుంటాం“ అన్నారు.
నిర్మాత రోహిణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ -“సినిమాలో తేజు డాన్సులు అదిరిపోతాయి. ఆడియన్స్ ను ఉత్సాహ పరిచే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఉష ఉతప్, కె.కె పాడిన పాటను ఈరోజు చిత్రీకరించాం. ఐటెమ్ సాంగ్ వెరీ స్పెషల్“ అన్నారు. ఇది పక్కా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తాగుబోతు రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ప్రేమ్ రక్షిత్, గుహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, కథ: షేక్ దావూద్, డైలాగ్స్: లక్ష్మి భూపాల్, ప్రొడ్యూసర్: సి.రోహిన్ కుమార్ రెడ్డి, దర్శకత్వం: సునీల్ రెడ్డి.

No comments:
Post a Comment