హాయ్ .. నా పేరు చేతన్. మాది వైజాగ్. నాన్నగారు 15ఏళ్ల క్రితమే అమెరికాలో సెటిలయ్యారు. నేను బెంగళూరులో రిషి వ్యాలీలో స్కూలింగ్ చేశా. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫికల్ స్కూల్ అది. అటుపై వైజాగ్ ఆంధ్రా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదివాను. అయితే అందరిలానే అమెరికా వెళితే అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలి. కానీ నాకు 9 టు 6 జాబ్ అంటే ఇష్టం లేదు. పైగా చిన్నప్పట్నుంచి సినిమా పిచ్చి. సినిమాలు చూస్తూనే పెరిగాను. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం స్నేహితులంతా కలిసి ఓ లఘుచిత్రం తెరకెక్కించాం. ఆ క్రమంలోనే నటనపై ఆసక్తి పెరిగింది. ఆ సంగతినే నాన్నగారికి చెబితే ఆయన ఎంకరేజ్ చేశారు. వాస్తవంగా సినిమా అంటే నాన్నకు నాకంటే రెట్టింపు ఇష్టం. అందుకే అట్నుంచి ఎగ్జయిట్‌మెంట్ పెరిగింది.. దాంతో వైజాగ్ సత్యానంద్ వద్ద నటనలో ట్రైనింగ్ తీసుకున్నా. అక్కడ స్టేజ్ యాక్టింగ్‌లో డ్రమటికల్ స్టయిల్‌లో శిక్షణ కొనసాగింది. స్టేజీ నటన మీద గ్రిప్ పెరిగింది. అటుపై రోజులు మారాయి చిత్రానికి ఆడిషన్‌కి వచ్చి దిల్‌రాజుగారు, మారుతి గారిని కలిశాను. ఆడిషన్స్‌లో ఎంపిక చేసుకుని తర్వాత నటనలో తర్ఫీదునిచ్చారు. అప్పటికి నేర్చుకున్న ఏబీసీలను దాటి వారివద్ద నేర్చుకోగలిగాను. సినిమాటిక్ నటన అంటే ఏంటో ఇక్కడికొచ్చాకే తెలిసింది. ముఖ్యంగా మారుతి గారు నాకు పూర్తి స్థాయి గ్రూమింగ్ (నటశిక్షణ) చేశారు. క్రమశిక్షణ నేర్పించారు. బయట వ్యాపకాలు వదిలేసి పూర్తిగా కెరీర్‌పై దృష్టి సారించమని ఆయన చెప్పారు. 3నెలల్లోనే నాలో మార్పు వచ్చింది. కెమెరా ముందు పదే పదే సీన్స్‌లో నటించి నా నట ప్రదర్శన చెక్ చేసుకోమని మారుతి చెప్పేవారు. అలా నన్ను నేను ముందే చెక్ చేసుకునే ఛాన్స్ వచ్చింది.
`రోజులు మారాయి` చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వచ్చింది. చుట్టూ అంతా పాజిటివ్ అని నమ్మే ఓ పాజిటివ్ కుర్రాడి పాత్రలో నటించాను. ఓ చిన్న సినిమాకి రెండు రోజుల్లో రూ.2కోట్లు వసూలవ్వడం అంటే అది ఆ బ్యానర్ విలువ వల్లనే. నా సహనటీనటులు కృతిక, తేజస్వి, నూకరాజు ప్రోత్సాహంతో తొలి ప్రయత్నమే అయినా ఏ ఇబ్బంది లేకుండా నటించగలిగాను. ఇక పరిశ్రమలో ఓ చక్కని హీరోగా నిలబెడతామని దిల్‌రాజు గారు, మారుతి ప్రామిస్ చేశారు. వారి మార్గదర్శకత్వంలో నన్ను నేను మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నా. రోజులు మారాయి చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు థాంక్స్.. అన్నారు
The post మారుతి నన్ను నటుడిగా తీర్చిదిద్దారు: చేతన్ appeared first on MaaStars.
No comments:
Post a Comment