తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నప్పుడే తమిళంలో కెళ్లి ఇబ్బందులు పడినవాళ్లను చూశాం. అలాంటి హీరోనే నాని. `ఆహా కళ్యాణం`తో తమిళంలోకి వెళ్ళాడు నాని. అయితే ఆ సినిమా అక్కడ, ఇక్కడ … ఎక్కడా సరైన ఫలితం ఇవ్వలేదు. ఆ సినిమా తర్వాత నాని మళ్ళీ తమిళం వైపు వెళ్లాలనుకుంటున్నాడు. అయితే ఈ సారి బై లింగ్వుల్ గా. త్వరలో తెలుగు – తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు నాని. దీంతో నాని మరోసారి రిస్క్ చేస్తున్నాడంటున్నారు. నాని ఒకసారి తమిళ సినిమాల గురించి మాట్లాడుతూ “నా లింప్ సింక్ సరిగ్గా లేక `ఆహా కళ్యాణం` సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. అందుకే మళ్ళీ అటువైపు చూడలేదు“ అన్నాడు. మరి ఇప్పుడ ఏం అయ్యింది మళ్ళీ తమిళ సినిమా చేస్తానంటున్నాడో చూడాలి. ప్రస్తుతానికి నాని విరించి వర్మ సినిమాలో నటిస్తున్నాడు.
The post నాని మళ్ళీ అదే తప్పు చేస్తాడా? appeared first on MaaStars.
No comments:
Post a Comment