Saturday, 2 July 2016

సైమా విన్నర్స్‌ వీరే..!


SIIMA-maastars



దక్షిణాదికి చెందిన నాలుగు చిత్ర పరిశ్రమల నుంచి గతేడాది విడుదలైన చిత్రాలకుగానూ ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘సైమా’ అవార్డుల వేడుకను జూన్‌ 30న సింగపూర్‌లో ఘనంగా నిర్వహించారు. దక్షిణాది తారలంతా ఒకే వేదికపై తళుక్కుమన్నారు. యువతారలు నృత్యాలతో అలరించారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, రాధిక సుహాసిని, వరుణ్‌తేజ్‌, హన్సిక, సమంత, ప్రగ్యా జైస్వాల్‌, శృతీహాసన్‌, విక్రమ్‌ నయనతార, నిత్యామీనన్‌, చిత్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ చిత్రంగా బాహుబలి, ఉత్తమ హీరోగా మహేష్‌బాబు, ఉత్తమ హీరోయిన్‌గా శృతిహాసన్‌ అవార్డులు అందుకున్నారు. మధురగాయని జానకమ్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
ఇతర అవార్డుల వివరాలు:


జీవిత సాఫల్య పురస్కారం: ఎస్‌. జానకి
ఉత్తమ చిత్రం: బాహుబలి
ఉత్తమ దర్శకుడు: ఎస్‌.ఎస్‌. రాజమౌళి(బాహుబలి)
ఉత్తమ నటుడు: మహేశ్‌బాబు(శ్రీమంతుడు)
ఉత్తమ నటి: శ్రుతిహాసన్‌(శ్రీమంతుడు)
ఉత్తమ నటుడు(క్రిటిక్స్‌): అల్లు అర్జున్‌( రుద్రమదేవి)
ఉత్తమ నటి(క్రిటిక్స్‌): అనుష్కశెట్టి(రుద్రమదేవి)


ఉత్తమ సహాయనటి: రమ్యకృష్ణ(బాహుబలి)
ఉత్తమ ప్రతినాయకుడు: రానా దగ్గుబాటి(బాహుబలి)
ఉత్తమ సహాయనటుడు: రాజేంద్రప్రసాద్‌(శ్రీమంతుడు)
ఉత్తమ దర్శకుడు(తొలి పరిచయం): అనిల్‌ రావిపూడి(పటాస్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌(శ్రీమంతుడు)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సాగర్‌(జతకలిసే.. శ్రీమంతుడు)
ఉత్తమ గీత రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి(కంచె)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: జాని(టెంపర్‌)
ఉత్తమ నిర్మాత(తొలి పరిచయం): విజయ్‌రెడ్డి, శశిదేవ్‌రెడ్డి(భలే భలే మగాడివోయ్‌)


ఉత్తమ నటుడు(తొలి పరిచయం): అక్కినేని అఖిల్‌(అఖిల్‌)
ఉత్తమ నటి(తొలిపరిచయం): ప్రగ్యా జైశ్వాల్‌(కంచె)
ఉత్తమ హాస్యనటుడు: వెన్నెలకిషోర్‌(భలే భలే మగాడివోయ్‌)


ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: సెంథిల్‌కుమార్‌(బాహుబలి)
ఉత్తమ నేపథ్య గాయని: సత్యయామిని(మమతల తల్లి.. బాహుబలి)
బాగా ప్రసారం అయిన పాట: రామ రామ(శ్రీమంతుడు)



No comments:

Post a Comment